Inter Practicals : ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రాక్టికల్స్ నిర్వహణపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. ప్రతి వారం ప్రాక్టికల్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షల అంశాలను వెల్లడించిన బోర్డు.. మరో 15 రోజుల్లో ప్రాక్టికల్స్‌కు సంబంధించిన విధివిధానాలతో మాన్యువల్‌ను విడుదల చేసి, బోర్డు వెబ్సైట్లో పెట్టనుంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.
గత ఏడాది వరకు ఇంటర్మీడియట్ సెకండియర్‌లో మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి ఫస్టియర్‌లో కూడా ప్రాక్టికల్స్ పెట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఎంపీసీ 60 మార్కుల ప్రాక్టికల్స్కుగానూ ఫస్టియర్‌లో 30 మార్కులకు, సెకండియర్‌లో 30 మార్కులకు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా బైపీసీ 120 మార్కుల ప్రాక్టికల్స్కుగానూ ఫస్టియర్‌లో 60 మార్కులకు, సెకండియర్‌లో 60 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. కాగా, ఈసారి గణితానికి కూడా అంతర్గత మార్కులు ఉంటాయని బోర్డు ప్రకటించింది.