Inter Hall Tickets | హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : హాల్‌టికెట్లల్లో తప్పులు సవరించడంలో భాగంగా ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి తల్లిదండ్రుల వాట్సాప్‌నకు ఇంటర్ హాల్‌టికెట్లు పంపించనున్నది. 45 రోజుల ముందుగానే హాల్‌టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్‌నకు పంపించనున్నట్టు ఇంటర్‌బోర్డు కా ర్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.
హాల్‌టికెట్‌లో తప్పుఒప్పులను ముందే గుర్తించే అవకాశం ఉంటుందని పే ర్కొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నా యి. ఈ నెల 20 నుంచి హాల్‌టికెట్లను తల్లిదండ్రులకు పంపిస్తారు. తప్పులుంటే కాలేజీ ప్రిన్సిపాళ్లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.