హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు వడ్డీ లే ని రుణాల పథకం ఆరంభ శూరత్వం గా వెక్కిరిస్తున్నది. మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు అయ్యే వడ్డీని తామే చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. లో క్‌సభ ఎన్నికల నేపథ్యంలో మొదటి మూడు నెలల వడ్డీని చెల్లించింది. కా నీ, ఏడు నెలలుగా వడ్డీ డబ్బులు న యాపైసా కూడా చెల్లించలేదని మహి ళా స్వయం సహాయక సంఘాల స భ్యులు చెప్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.100 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఏడు నెలలుగా రూ.700 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం పెండింగ్ నిధులు విడుదల చేయాలని మహిళా సభ్యులు కోరుతున్నారు.