హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతిస్తామని ఇంటర్‌బోర్డు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఈ సారి రెండు విడతల్లో చేపడతారు. 29 నుంచి మొదటి విడత, 31 నుంచి రెండో విడత మూల్యాంకనం ప్రారంభంకానుంది. ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల దరఖాస్తు గడువును మరొక రోజు పొడిగించారు.