హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24 నుంచి జూన్ 3వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు శుక్రవారం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు శుక్రవారం సాయంత్రం నుంచే tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.