Suicide | హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల పరిధిలోని శివరాంపల్లిలో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
శివరాంపల్లికి చెందిన రెడ్డి అర్చన(17) సోమారం మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది. శుక్రవారం పరీక్ష రాసిన అనంతరం ఆ అమ్మాయి ఇంటికి తిరిగొచ్చింది. శుక్రవారం రాత్రంతా తన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది. శనివారం ఉదయం నాటికి ఆమె చనిపోయింది. తల్లిదండ్రులు రెడ్డి రాజు, లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.