హైదరాబాద్ : ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు స్పందించింది. త్వరలోనే ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేస్తామని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో వెల్లడించారు. ఇంటర్ ఫలితాల విడుదలకు సంబంధించి ఒకట్రెండు రోజుల నుంచి గందరగోళం నెలకొన్న విషయం విదితమే. ఈ నెల 15న ఫలితాలు ప్రకటిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల ఆగిపోయింది.
16న ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడి అవుతాయని కొన్ని దినపత్రికలు, వెబ్సైట్లు రాశాయి. అయినప్పటికీ ఫలితాల విడుదలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. విద్యార్థులు గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో ఒక ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ఫలితాలు ప్రకటిస్తామని బోర్డు వెబ్సైట్లో పేర్కొన్నారు.