ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి ఉమర్ జలీల్ మంగళవారం సాయంత్రం ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. జనరల్ కోర్సుల్లో 67.72 శాతం ఉత్తీర్ణత సాధించగా, వోకేషనల్ కోర్సుల్లో 57.28 శాతం ఉత్తీర్ణత సాధించారు. జనరల్ కోర్సు పరీక్షలకు 2,20,456 మంది విద్యార్థులు హాజరు కాగా, 1,49,285 మంది పాసయ్యారు. వొకేషన్ కోర్సు పరీక్షలకు 18,955 మంది హాజరు కాగా, 10,858 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం www.tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
ఇక మంగళవారం ఉదయం విడుదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో జనరల్‌లో 48,816 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 65.07శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

