హైదరాబాద్, మార్చి3 (నమస్తే తెలంగాణ): అధికారుల నిర్లక్ష్యం ఇంటర్ విద్యార్థులకు శాపంగా మారింది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పూలే జూనియర్ కాలేజీలో 48 మంది ఫస్టియర్, 66 మంది సెకండ్ ఇయర్ చదువుతున్నారు.
ఆ కళాశాల పేరు మహాత్మా జ్యోతిబాపూలే దుబ్బాక అని ఉండటంతో సిద్దిపేట డీఐవో రవీందర్రెడ్డి సెంటర్ను దుబ్బాకలో వేశారు. పరీక్షలకు ఒకే రోజు గడువు ఉండటంతో 48 కిలోమీటర్ల దూరం వెళ్లి పరీక్ష రాసేదెలా అని విద్యార్థులు మదనపడుతున్నారు. కేంద్రాన్ని మార్చాలని కోరుతున్నారు.