హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): మహాత్మాజ్యోతిబా ఫూలే బీసీ గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశపరీక్ష ఫలితాలను సోమవారం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు సోమవారం విడుదల చేశారు. ఈ ఫలితాలలో సిద్దిపేట జిల్లాకు చెందిన పీ జ్యోత్స్న ఎంపీసీలో 150 మారులకు 122 మారులు పొంది, మొదటి స్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లాకు చెందిన పీ శ్రీవల్లి బైపీసీలో 108 మారులను, పెద్దపల్లి జిల్లాకు చెందిన కే సాయి సంహిత సీఈసీలో 107 మారులను, మేడ్చల్ జిల్లాకు చెందిన ఏ అర్చన ఎంఈసీలో 109 మారులను సాధించి, అగ్రస్థానంలో నిలిచారు.
ఐదో తరగతి ప్రవేశపరీక్ష ఫలితాలు వెల్లడి
ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని ఐదోతరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సచివాలయంలో చేశారు. మొత్తం 1,21,826 దరఖాస్తులు రాగా, 1,13,219 మంది అభ్యర్థులు ఏప్రిల్ 23న పరీక్ష రాశారు. ఈ ఏడాది సీట్ల భర్తీలో 10శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.