హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్‌బేస్డ్ బయోమెట్రిక్ హాజరును అమలుచేయాలని నిర్ణయించింది. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని రాష్ట్రంలో 19 సెంటర్లల్లో నిర్వహించనున్నారు.
బుధవారం నుంచి మూల్యాంకనం ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 10తో ముగుస్తుంది. ప్రతి సెంటర్లో 600-1200 మంది వరకు సిబ్బంది మూల్యాంకన విధుల్లో పాల్గొంటారు. బీఐఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌లో వేలిముద్రలు, లేదా ఫేసియల్ రికగ్నిషన్ ద్వారా హాజరుచేయవచ్చు.