TG BIE | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును జూలై 31 వరకు పొడగించినట్టు ఇంటర్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
అడ్మిషన్ల గడువు ఈ నెల 30తో ముగియనుండగా, శుక్రవారం పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలవడంతో వీరికి ప్రవేశాలతోపాటు 250 కాలేజీలకు అఫిలియేషన్ పెండింగ్ ఉన్నందున గడువు పెంచినట్టు పేర్కొన్నారు.