హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): గురుకుల ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాల గడువును 15వ తేదీ వరకు పొడిగించినట్టు సొసైటీ కార్యదర్శి వర్షిణి శనివారం ప్రకటనలో తెలిపారు.
మొదటి విడత జాబితాలో సీటు పొందిన విద్యార్థులు శనివారంలోగా ప్రవేశాలు పొందాలని తొలుత గడువు విధించారు. ఇప్పుడు మరో 8 రోజులపాటు పెంచారు.