హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), మరోవైపు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మ రం చేశాయి. ఆగమేఘాల మీద ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. ఫార్ములా ఈ-కార్ రేస్‌కు సంబంధించిన ఫైళ్లు కావాలని ఎంఏయూడీ కార్యాలయాన్ని కోరడంతో వాటిని అప్పటికే ఏసీబీ అధికారులు తీసుకెళ్లారని సమాధానం వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఫెమా ఉల్లంఘనలపై దృష్టిసారించిన ఈడీ.. విదేశీ కంపెనీకి నిధులు పంపేముందు రాష్ట్ర అధికారులు ఆర్బీఐ నుంచి అనుమతి తీ సుకున్నారా? సంబంధిత నిబంధనల ను పాటించారా లేదా అనే కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. దీని లో భాగంగా హెచ్ఎండీఏ బ్యాంకు ఖా తా నుంచి ఎఫ్ఈవో సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీలపై ఈడీ దృష్టి సా రించినట్టు తెలిసింది. మరోవైపు ఎంఏయూడీ కార్యాలయం నుంచి తెప్పించుకున్న ఫైళ్లను లోతుగా పరిశీలిస్తున్న ఏసీ బీ అధికారులు ఈ రేసుతో సంబంధమున్న పలువురు అధికారులకు సోమవారం నుంచి నోటీసులు జారీచేయనున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
‘