నిజామాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సోయా రైతులకు నష్టాలు వాటిల్లకుండా చూసే బాధ్యత తమదేనని మార్క్‌ఫెడ్ ప్రకటించింది. కనీస మద్దతు ధరతో సోయా ఉత్పత్తులను సేకరించేందుకు కృషి చేస్తున్నట్టు మార్క్‌ఫెడ్ కామారెడ్డి జిల్లా మేనేజర్ మహేశ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోయా పండించిన రైతులకు జరుగుతున్న నష్టంపై ‘నమస్తే తెలంగాణ’లో ‘పక్క రాష్ర్టాలకు సోయా’ శీర్షికన ప్రచురితమైన కథనాలకు మార్క్‌ఫెడ్ ప్రొక్యూర్మెం ట్ ఉన్నతాధికారులు స్పందించి వివరాలపై ఆరా తీశారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మం డలం పెద్దకొడప్గల్ మండలంలో భారీ ఎ త్తున సోయా దిగుబడులు వచ్చినప్పటికీ.. ఇంత వరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రభు త్వం ఏర్పాటు చేయలేదు. ఫలితంగా సో యాను మహారాష్ట్రకు తరలిస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నది నిజమేనని నిర్ధారించారు. ఈ మేరకు పెద్దకొడప్గల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ చర్య లు చేపట్టింది. కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలని పీఏసీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.