హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఇన్స్పైర్ ప్రోగ్రాంకు రాష్ట్రం నుంచి 2,912 ప్రాజెక్ట్‌లు ఎంపికయ్యాయి. 2022 -23 విద్యాసంవత్సరానికి ఆయా ప్రాజెక్ట్‌లకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. శనివారం జిల్లాల వారీగా ఎంపికైన ప్రాజెక్ట్‌ల వివరాలను అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టులను జిల్లాస్థాయిలో ప్రదర్శించాక, అందులో 10 శాతం రాష్ట్రస్థాయికి, రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రాజెక్టులలో 10 శాతం జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు.