హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఆయుర్వేద, హోమియోపతి తదితర పేర్లతో నడుస్తున్న క్లినిక్‌లను తనిఖీ చేసి, అనుమతులు లేని దవాఖానలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
బుధవారం ఆయుష్ వైద్య సేవలపై నేచర్‌క్యూర్ దవాఖానలో సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట, వికారాబాద్, భూపాలపల్లిలోని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ దవాఖానల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి, త్వరగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.