కోకాపేటలో కుల ప్రముఖులతో ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి గంగుల సమావేశం
హైదరాబాద్, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా కోకాపేటలో నిర్మిస్తున్న మున్నూరుకాపు ఆత్మగౌరవ భవనం పనులను మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి కమలాకర్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తమరావు, జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీరమళ్ల ప్రకాశ్, సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ మీసాల చంద్రయ్య, కౌన్సిల్ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వేగవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. జనవరి 11న రాజకీయాలకతీతంగా మున్నూరుకాపు పెద్దలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదెకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. సమావేశంలో గాలి అనిల్‌కుమార్, లక్ష్మణ్, కుమార్, అనిల్‌కుమార్, రామారావు, వెంకన్న, ఆనందరావు, నాగేంద్రబాబు, ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.