మక్కల కొను‘గోల్’మాల్‌పై రెండోరోజూ విచారణ
మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మక్కల కొనుగోళ్లలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
- పీఏసీసీఎస్ చైర్మన్‌పై క్రిమినల్ చర్యలతోపాటు రికవరీకి అవకాశం
మహబూబ్‌నగర్, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మక్కల కొనుగోళ్లలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చైర్మన్‌తో కుమ్మక్కైన మార్క్‌ఫెడ్ డీఎంను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం హార్టికల్చర్ ఆఫీసర్ వేణుగోపాలరావు నేతృత్వంలోని విచారణ బృందం రికార్డులన్నింటినీ కలెక్టర్ కార్యాలయానికి తెప్పించుకొని అర్ధరాత్రి వరకు పరిశీలించింది.
రైతులు అమ్మిన పంటకు వారికి చెల్లించిన డబ్బులకు వ్యత్యాసం ఎక్కువగా ఉండటాన్ని ప్రాథమికంగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా మొక్కజొన్న బస్తాలను తన గోదాంకు తరలించి భారీ ఎత్తున తరుగు చూయించి మిగిలిన బస్తాలను బినామీ పేర్లతో అమ్ముకున్నట్టు రికార్డుల్లో తేలుతున్నది. మార్క్‌ఫెడ్ పంపిణీ చేసిన డబ్బులను ట్రాక్ షీట్లతో సరి పోల్చుతున్నారు. అక్రమాలు నిజమని తేలితే చైర్మన్‌పై క్రిమినల్ చర్యలతో పాటు రికవరీకి కూడా అవకాశం ఉందని ఒక అధికారి వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

