హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా కొండాపూర్ ఇండస్ట్రియల్ పారులో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు పూర్తి చేసుకున్న పలు పరిశ్రమలు.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన కొండాపూర్ పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు.
హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శాసనమండలిలో ఒత్తిడి తీసుకురావాలని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారిని ఉద్యమకారులు కోరారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సురేంద్‌రెడ్డి ఆధ్వర్యంలో తొలి, మలిదశ ఉద్యమకారులు.. సిరికొండను కలిసి వినతిపత్రం అందచేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): విద్యాసంవత్సరం మధ్యలో విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగులు, ఇంజినీర్ల బదిలీలు చేపట్టడంపై తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ నవీన్‌మిట్టల్, డిస్కంల సీఎండీలు ముషారఫ్, వరుణ్‌రెడ్డికి వినతిపత్రాలు సమర్పించారు.