హైదరాబాద్,ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ): ఆస్తి పంపకాల విషయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్‌రావు (86) ఆయన మనుమడు చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం… వందలకోట్లు ఆస్తులు కలిగి ఉన్న చంద్రశేఖర జనార్దన్‌రావు ప్రముఖ కంపెనీ వెల్జాన్కు చైర్మన్‌గా ఉన్నారు. జనార్దన్‌రావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చంద్రశేఖర జనార్దన్‌రావు రెండో కూతురు సరోజ తన తండ్రితో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. ఆమె భర్త బెంగళూరులో ఉంటుండగా, ఆమె కొడుకు కిలా రు కీర్తితేజ అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేశాడు.
డ్రగ్స్‌కు బానిసవడంతో కీర్తితేజను ఇండియాకు తీసుకొచ్చారు. ఇటీవల నాలుగుకోట్ల రూపాయల షేర్స్‌ను కీర్తితేజకు చంద్రశేఖర జనార్దన్‌రావు బదిలీ చేయడంతోపాటు తన కంపెనీలో మరో కుమార్తె కొడుకుకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు. తనకు కూడా డైరెక్టర్ పోస్టు కావాలంటూ కీర్తితేజ డిమాండ్ చేయగా జనార్దన్‌రావు అందుకు నిరాకరించాడు. గురువారం సోమాజిగూడలో ఉంటున్న జనార్దన్‌రావు వద్దకు వచ్చిన కీర్తితేజ డైరెక్టర్ పోస్ట్ కోసం గొడవపడ్డాడు. కాసేపటికి తల్లి వంటింట్లోకి వెళ్లగా కీర్తితేజ తనతో తెచ్చుకున్న కత్తితో తాతను 73సార్లు పొడిచాడు. అడ్డుకోబోయిన తల్లిని కూడా12సార్లు కత్తితో పొడిచాడు. కేకలువిని చుట్టుపక్కల వారు వచ్చి ర క్తపు మడుగులో ఉన్న సరోజను దవాఖాన కు తరలించారు. కీర్తితేజను సెక్యూరిటీ గార్డ్ అడ్డుకునేందుకు యత్నించగా చంపుతానం టూ బెదిరించి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కీర్తితేజ కోసం గా లించి ఏలూరు దగ్గర అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.