హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇంద్రజిత్ గుప్తా 24వ వర్ధంతి సందర్భంగా గురువారం ఆ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.