28 నుంచి ఇందిరమ్మ ఇండ్లకు లక్కీ డ్రా: పొంగులేటి
హైదరాబాద్ నగరంలోని క్యూర్ పరిధిలో ఈ నెల 28 నుంచి 31 వరకు ఇందిరమ్మ టవర్స్ దరఖాస్తుల లక్కీ డ్రా నిర్వహించనున్నట్టు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలోని క్యూర్ పరిధిలో ఈ నెల 28 నుంచి 31 వరకు ఇందిరమ్మ టవర్స్ దరఖాస్తుల లక్కీ డ్రా నిర్వహించనున్నట్టు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ మొత్తం 60,720 అప్లికేషన్లు వచ్చాయని వెల్లడించారు.
ఇందులో 40,900 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించేందుకు వీలుగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈ నియోజకవర్గాల పరిధిలోని అర్హులు ఇందిరమ్మ టవర్స్ కోసం వచ్చే నెల 3లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.
రోజుకు 60 మందికి ‘ఉపాధి’ పని కల్పించాలి : సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుని వన మహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 6.18 కోట్ల మొకలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 5.32 కోట్లకుపైగా (86 శాతం) మొకలు నాటినట్టు తెలిపారు.

సచివాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని ఆదేశించారు. సెప్టెంబర్ నుంచి కొత్త చేయూత పెన్షన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి దరఖాస్తునూ క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతను నిర్ధారించాలని సీతక ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

