CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఈ ఏడాది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని, ఆయా ఇండ్లపై కేంద్రం బ్రాండింగ్ వేసేందుకు కూడా వెనుకాడబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో ఇల్లు లేని పేదల సమగ్ర డాటాను కేంద్రానికి పంపాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించినట్టు తెలిసింది. కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్రం వాటాగా ఇవ్వాల్సిన నిధులను హౌసింగ్‌బోర్డు భూములు, రాజీవ్ స్వగృహ ఇండ్లు విక్రయించి సమకూర్చుకోవాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఇరిగేషన్ శాఖలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ విభాగాల్లో కలిపి దాదాపు 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ)లను ఎంపిక చేయగా, జలసౌధలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌తో కలిసి వారికి నియామకపత్రాలు అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉం దని, అందుకు అనుగుణంగా నీళ్లను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఇంజినీర్లపై ఉందన్నారు. అనంతరం ఇరిగేషన్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సాగునీటిపారుదలశాఖ కార్యదర్శి రా హుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి జీవన్‌పాటిల్, ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.