ఎన్నారై తల్లికి ఇందిరమ్మ ఇల్లు!
ఒక కొడుకు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.. మరో కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంకో కొడుకు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్. అయితే నేం, వారి తల్లికి మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
కూసుమంచి, ఏప్రిల్ 29: ఒక కొడుకు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.. మరో కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంకో కొడుకు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్. అయితే నేం, వారి తల్లికి మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ విషయం సాక్షాత్తు గృ హనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలోనే బయటపడింది. అదీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ని యోజకవర్గంలోనే! ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో బుధవారం ప్రజాదర్బార్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి.. పలు పథకాల లబ్ధిదారులకు మైక్ ఇచ్చి మాట్లాడాలని కోరారు. పాలేరు గ్రామానికి చెందిన పిల్లి నీలమ్మ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు మైక్ తీసుకొని.. తనకు ఇల్లు లేదని, ఈ ప్రభుత్వంలో తనకు ఇల్లు వచ్చిందని చెప్పారు. వేదికపై ఉన్న మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. ‘చెల్లెమ్మా.. పిల్లలు ఏం చేస్తున్నారు?’ అని అడిగారు. అందుకు ఆమె బదులిస్తూ.. ‘నాకు నలుగురు పిల్లలు. ఒకరు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు సోషల్‌మీడియా నడుపుతున్నారు. ఇంకొకరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు..’ అని చెప్పడంతో సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే మంత్రి కలుగజేసుకొని.. ఇలాంటి వారికి ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇచ్చారని సర్పంచ్‌ను ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

