హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుందని, ప్రాథమిక హకులకు భంగం వాటిల్లితే తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ నవంబర్ 14న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వలేమని జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ కే శరత్ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.