హైదరాబాద్, సెప్టెంబరు 24(నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకుంటేనే బిల్లులు ఖాతాలో జమ అవుతాయని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.
ఇంటి నిర్మాణం జరిగినా బ్యాంకు ఖాతాలో బిల్లులు జమ కానివారు తమ బ్యాంకులకు వెళ్లి ఆధార్‌ను లింకు చేసుకోవాలని సూచించారు.