హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఇందిరా సౌరగిరి జలవికాసం పథకంలో భాగంగా ఏర్పాటుచేసే సోలార్ పంపుసెట్లకు రూపాయి ఇవ్వబోమని, తమ ను రూపాయి అడగొద్దని ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రభుత్వంపై అదనపు భారం మోపవద్దని షరతులు విధించింది. ‘కావాలంటే అప్పు తెచ్చుకోండి.. మీరే తీర్చుకోండి.. కానీ మేం చెప్పినట్టు సోలార్ పంపుసెట్లను ఏర్పా టు చేయాలి’ అని ఉత్తర డిస్కంకు సూచించింది. రుణాలు సేకరించి ఈ స్కీమ్‌ను అమ లు చేయాలని, ప్రభుత్వం అందించే సబ్సిడీ ని పొదుపు చేసుకుని, దాని నుంచి ఈ రు ణాన్ని తిరిగి చెల్లించాలని సూచించింది. ఇందిరా సౌరగిరి జలవికాసం పథకాన్ని మే 19 న సీఎం రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి రైతుకు సోలార్ పంపుసెట్లను అందజేస్తామని ఆనాడు సీ ఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు పైలట్ పద్ధతిలో వంగూరు మండలాన్ని ఎంపికచేశారు. ఈ మండలంలోని 7,500 పంపుసెట్లను ఏర్పాటు చేయాలని, ఇందుకు రూ.258 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వానికి ప్రాతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు ఆమో దం తెలిపిన ప్రభుత్వం తాము మాత్రం రూపాయి ఇవ్వబోమని తేల్చిచెప్పింది.
అధికారుల తర్జనభర్జన
డిస్కం స్థాయిలో రుణాలను తెచ్చుకోవాలని, ఈ రుణాన్ని సబ్సిడీల నుంచి తిరిగి చెల్లించాలని, ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారాన్ని మోపవద్దన్న షరతులతో ఆమోదం తెలిపింది. దీంతో అప్పులు తెచ్చి, సబ్సిడీల నుంచి ఎలా చెల్లించాలన్న మీమాంసలో డిస్కం అధికారులు పడ్డారు. ఒక్క మండలానికే రూ.258 కోట్లు వెచ్చిస్తే, మిగతా మండలాల పరిస్థితేమిటి? ఆ మండలాలకు నిధులెక్కడి నుంచినుంచి తేవాలి? అని తర్జనభర్జనలు పడుతున్నారు. ఉ ద్యోగులు, ఇంజినీర్లకు జీతాలిచ్చేందుకే డి స్కం ఆపసోపాలు పడుతున్నది.