హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ను దక్షణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 1,465 రూట్ కిమీ మేరకు అమలు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. కవచ్‌ను శుక్రవారం సనత్‌నగర్-వికారాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య 63 కిలోమీటర్ల వరకు విజయవంతంగా అమలు చేశామని చెప్పారు. కవచ్‌ను ‘రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్వో), ఇండియన్ ఇండస్ట్రీ సహకారంతో అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం 10,000 లోకోమోటివ్‌లో కవచ్ నూతన వెర్షన్ 4.0ను ఏర్పాటు చేయడానికి ఇండియన్ రైల్వే ఆమోదం తెలిపిందన్నారు. ఎస్సీఆర్ ఆధ్వర్యంలో 1,465 రూట్ కిలోమీటర్లలో 144 లోకోమోటివ్‌లో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
శబరిమలకు 8 ప్రత్యేక రైళ్లు
శమరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. మౌలాలి-కొల్లం, మచిలీపట్నం-కొల్లం రైల్వే స్టేషన్ల మధ్యలో ఈ నెల 22 నుంచి డిసెంబర్ 1 వరకు షెడ్యూల్ వారీగా ప్రత్యేక రైళ్ల రాకపోకలు ఉంటాయని పేర్కొన్నారు.