కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి అర్షిద్ అశ్రిత్ మృతి చెందాడు.బట్టల వ్యాపారి అర్షిద్ అర్జున్-ప్రతిమ కుమారుడు అర్షిద్ అశ్రిత్ వియత్నాంలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
మంగళవారం తెల్లవారు జామున కాన్‌థో నగరంలో స్నేహితుడితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తూ అదుపు తప్పి ఓ ఇంటిగోడను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అశ్రిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని స్నేహితుడు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. అశ్రిత్ మరణవార్త విని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీయ్యారు.