హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ)/ఖలీల్వాడి: ఇండియన్ లైబ్రరీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జనవరి 2, 3 తేదీల్లో కేరళలోని కన్నూరులో నిర్వహించే సాంస్కృతిక విభాగ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వా నం అందింది. 2న సాయంత్రం జరుగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత హాజరవుతారు.
‘దేశ సంస్కృతి-ప్రజల జీవన విధానం’ అంశంపై 3న జరిగే చర్చలో కూడా ఆమె పాల్గొననున్నారు. కార్యక్రమాలను కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖులతో ప్రతి సంవత్సరం ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఇష్టాగోష్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ ఏడాది వీటిని కేరళలో జరుపనున్నారు.