FRM | న్యూఢిల్లీ: మయన్మార్‌లోని సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ‘స్వేచ్ఛాయుత రాకపోకల విధానం’ (ఎఫ్ఆర్ఎం) రద్దు చేయాలని నిర్ణయించింది. ఇటీవలి కాలంలో మయన్మార్ నుంచి వేలాదిమంది సైనికులు భారత్‌లోకి ప్రవేశించడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ అంతర్గత రక్షణ, ఈశాన్య రాష్ర్టాల భౌగోళిక నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఆర్ఎంను రద్దు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురువారం ప్రకటించారు. స్వేచ్ఛాయుత రాకపోకల విధానంలో భాగంగా భారత్-మయన్మార్ సరిహద్దు నుంచి 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి పత్రాలు లేకుండా రాకపోకలు సాగించవచ్చు. మయన్మార్‌తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ర్టాల్లో ఎఫ్ఎంఆర్ అమల్లో ఉంది.