రోడ్ నెట్వర్లో భారత్ నంబర్‌వన్
భారతదేశపు రోడ్ల అనుసంధానం ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థాయికి ఎదిగిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడరీ తెలిపారు.
- ఐఆర్సీ సదస్సులో కేంద్రమంత్రి గడరీ
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): భారతదేశపు రోడ్ల అనుసంధానం ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థాయికి ఎదిగిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడరీ తెలిపారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) వార్షిక సదస్సును గురువారం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గడరీ ప్రసంగిస్తూ.. జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని, రహదారి నిర్మాణ రంగంలో ఎన్నో సరికొత్త రికార్డులను నెలకొల్పామని పేరొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, వాతావరణ మార్పులను తట్టుకునే నాణ్యమైన రహదారుల నిర్మాణంపై చర్చించడానికి ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే రెండేండ్లలో రాష్ట్రంలో రూ.93,000 కోట్ల విలువైన రహదారి మౌలిక సదుపాయాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో చేపట్టబోయే కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు. పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు త్వరగా ఇప్పించాలని గడ్కరీని కోరారు. .
గడరీకి కోమటిరెడ్డి వీరాభిమాని: సీఎం
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రమంత్రి గడరీకి శ్రేయోభిలాషి, అనుచరుడు, వీరాభిమాని అంటూ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకట్రెడ్డే గడ్కరీతో నిధులు మంజూరు చేయించుకుంటారని, అన్నీ వాళ్లే చూసుకుంటారని, తనకు ఆందోళన అవసరం లేదని అన్నారు. దీంతో వేదికపై ఉన్న గడరీతో పాటు సభలోని వారంతా నవ్వుకున్నారు. దీనికి వెంకట్‌రెడ్డి రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అటు ఔనన్నట్టు ఇటు కాదన్నట్టు తల అటు ఇటుగా ఊపడం గమనార్హం.
కేంద్రంతో చెత్తను కొనిపించండి!
మున్సిపల్ ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి జాతీయ రహదారుల నిర్మాణంలో వాడుతున్నామని, ఇందుకోసం రాష్ట్రాల వద్ద ఉన్న మున్సిపల్ వ్యర్థాలను కేంద్రం కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నదన్న గడ్కరీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. తన పక్కనే కూర్చొని ఉన్న మలాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌తో కేంద్రం కొంటానంటే జవహర్‌నగర్‌తో సహా నగరంలోని చెత్తనంతా అమ్మేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. జవహర్‌నగర్ డంప్ యార్డును ఎత్తివేయాలని ఈటల ఆ ప్రాంత వాసులకు మద్దతుగా పాదయాత్రలు చేస్తుండగా.. ‘నీకు పాదయాత్రల బాధ తప్పుతుంది, నాకు దాన్ని ఎత్తివేయాలనే నీ ఒత్తిడి తగ్గుతుంది. పైగా ఆదాయం వస్తుంది’ అనగా ఈటల రాజేందర్ నవ్వుతూ తలూపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

