వీపనగండ్ల, నవంబర్ 24: దళిత బంధు పథకం ద్వారా దళితుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. ఈ పథకం కింద వచ్చిన రూ. 10 లక్షలను తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇదే తోవలో ఏటూరి సాయిలీల అనే లబ్ధిదారు వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో ఇండిక్యాష్ ఏటీఎంను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ ఏటీఎం కేంద్రాన్ని గురువారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడంతో అనేక మంది నిరుపేదలు జీవనోపాధి పొందుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు.