
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నాడని..జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు గురువారం సాయంత్రం సుధాకర్ రెడ్డి తనను తన ఛాంబర్లో కలిసి నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లుగా రాత పూర్వకంగా లేఖ అందజేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. దీంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలారు.