
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి శీతల గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉదయం పూట పొగమంచు దట్టంగా కురుస్తున్నదని, ఆకాశం నిర్మలంగా ఉంటున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో 11 జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 26 వరకు ఏడు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.