BRS MLAs | బండి సంజయ్ మీద కేసు పెట్టాలని డీజీపీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
BRS MLAs | తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణలో శాంతి భద్రతలు ( Law and Order ) పూర్తిగా దిగజారిపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజేపీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు( BRS MLAs) పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజ్ శ్రవణ్, దేశిపతి శ్రీనివాస్ కలిసి వినతి పత్రం అందజేశారు.
కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారును ద్వంసం చేశారని బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డికి సెక్యూరిటీ పెంచాలని, దాడులను ప్రోత్సహించిన బండి సంజయ్ మీద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
నచ్చని రాజకీయ పార్టీల నేతల కార్యాలయాలపై, వారి ఇండ్లపై రౌడీలతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ రెచ్చగొడితేనే ఆయన కార్యకర్తలు దాడి చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండని దుయ్యబట్టారు. ఆయన మాట్లాడిన భాషను తాము మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు.
మతం పేరు చెప్పి రెచ్చగొట్టడం తప్ప ఆయన వల్ల ప్రజలకు రూపాయి లాభం లేదని వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ పై అనవసరంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

