హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ దవాఖానలో ప్రస్తుతమున్న 30 పడకలను 100కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం వైద్యశాఖ కార్యదర్శి ఎఎం రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. పడకల పెంపుతో పాటు రూ. 32.15 కోట్ల నిధులను కూడా మంజూరు చేసింది. పడకల పెంపుపై చెన్నూర్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.