IT Raids | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐటీ అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి.. ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. బంగారం కొనుగోలు పన్ను చెల్లింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తడంతో ఐటీ అధికారులు సోదాలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఈ ఐటీ సోదాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.