మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 08:31:41

పెరుగుతున్న వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రాబడి

పెరుగుతున్న వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రాబడి

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రాబడి క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటివరకు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.590 కోట్ల ఆదాయం సమకూరింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 17 వేలకుపైగా లావాదేవీలు జరిగాయి. ఈనెల 21 నుంచి వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత విధానంలోనే జరుగుతున్నాయి. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనావేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అందులో 24 శాతం మాత్రమే రాబడి నమోదయ్యింది. రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు ముందు 4,80,474 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ధరణి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు 66,614, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 19,620 జరిగినట్లు తెలిపారు.  


logo