షాద్‌నగర్‌రూరల్,సెప్టెంబర్27 : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ ఫథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తున్నయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్(MLA Anjaiah yadav) అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని కంసాన్పల్లి, మధురపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, వివిధ పార్టీన నాయకులు అదివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలొకి చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి అహ్వానించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ర్టంలో అమలవుతున్న సంక్షేమ ఫథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నయన్నారు. రాష్ట్రంలో సంక్షేమ ఫథకాలు అందని గడప లేదన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడంతో పార్టీ మరింత తిరుగులేని శక్తిగా మారిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని పథకాలను గడపగడపకు వివరించాలన్నారు.
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్, రుణమాఫీ, సబ్సిడీపై పనిముట్లు, సకాలంలో ఎరువులు, దళితబంధు, బీసీ బంధు, డబుల్బెడ్రూం ఇండ్లు, కులవృత్తులకు లక్షరూపాయల ఆర్థిక సహాయం తదితర సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో తొమ్మిదేండ్ల కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెంది, దేశానికి తలమానికంగా మారిందన్నారు. షాద్‌నగర్ నియోజక వర్గం మరింత అభివృద్ది సాదించాలంటే కారుగుర్తుకు ఓటు వేయలన్నారు.