Minister Errabelli | గులాబీ గూటికి రాజ్మాన్ సింగ్ తండా.. కాంగ్రెస్ యువజన నాయకులు
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం రాజ్మాన్ సింగ్ తండాకు చెందిన సర్పంచ్ గుగులోత్ పటేల్ నాయక్ నాయకత్వంలో కాంగ్రెస్ యువజన నాయకులు గుగులోత్ గణేశ్, గుగులోత్ యాకన్న, గుగులోత్ యాకన్నతోపాటు మరికొందరు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మహబూబాబాద్ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం రాజ్మాన్ సింగ్ తండాకు చెందిన సర్పంచ్ గుగులోత్ పటేల్ నాయక్ నాయకత్వంలో కాంగ్రెస్ యువజన నాయకులు గుగులోత్ గణేశ్, గుగులోత్ యాకన్న, గుగులోత్ యాకన్నతోపాటు మరికొందరు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి, బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై తాము బీఆర్ఎస్లో పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు.
రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి విజయం కోసం కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూక్యా బాలకృష్ణ, గుగులోత్ సుధాకర్, గుగులోత్ నరేశ్, గుగులోత్ సుమన్, జాటోత్ సుమన్, గుగులోత్ రాజ్‌కుమార్, జాటోత్ సందీప్ తదితరులు ఉన్నారు.
సీతారాంపురం గ్రామ మిత్ర యూత్ నాయకులు..
పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన బిజెపి యువజన నాయకులు, మిత్ర యూత్ సభ్యులు బి అర్ ఎస్ పార్టీ లో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బుధవారం వారు గులాబీ కండువాలు కప్పుకున్నారు. వారిని బిఆర్ఎస్ పార్టీలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో జి. శ్రీనివాస్, డి. అఖిల్, జి. రాకెష్, సిహెచ్. అఖిల్, జి. శ్రీకాంత్, ఏ. శ్రీకాంత్, వి. విజయ్, ఏ. నవీన్, జి. ప్రదీప్, ఏ. ప్రదీప్, ఏ. సందీప్, జి. నవీన్ దితరులు ఉన్నారు.

బీఆర్ఎస్లో చేరిన వావిలాల గ్రామ మాజీ సర్పంచ్..
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అనపర్తి ఉపేంద్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు నారబోయిన యాకయ్య, వసంత, సతీష్, వెంకన్న, ఉత్తేపు ఎల్లయ్య, అనపర్తి కరుణాకర్, సందీప్, మైసయ్య తదితరులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో BRS పార్టీలో చేరారు. పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పు పార్టీలోకి ఆహ్వానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

