హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఈ నెల 22న నిర్వహించే మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్, యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో 100కుపైగా పెద్ద కంపెనీలతో జాబ్‌మేళాను తలపెట్టారు. 10 వేల మంది నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. వివరాలకు 70976 55912 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సెట్విన్ ఎండీ వేణుగోపాల్ తదతరులు పాల్గొన్నారు.
టాపర్‌ను అభినందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఇంటర్ ప్రథమ ఫలితాల్లో 470/468 మార్కులతో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన తోక మణిదీపికను మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రిని మణిదీపిక కలువగా, భవిష్యత్తులో బాగా చదవాలని ఆమెను ఆశీర్వదించారు.