CM KCR | సీఎం కేసీఆర్ చారిత్రాత్మక పథకాలకు శ్రీకారం : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
CM KCR | రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చారిత్రాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy Lingaiah) అన్నారు.
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చారిత్రాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy Lingaiah) అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని కేతపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు బీఆర్ఎస్(BRS)లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని వెల్లడించారు.
రైతులకు పంట పెట్టుబడిసాయం చేయాలనే దృఢ సంకల్పంతో రైతు బంధు(Raitu Bandu), రైతు బీమా(Raitu Beema) వంటి చారిత్రాత్మక పథకాలకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని అన్నారు.బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ చిర్ర చంద్రయ్య, రావుల చిన్న మల్లయ్య, రావుల లింగరాజు, రావుల రాములు, గౌని సర్వయ్య, బయ్యా సతీష్, కడెం గణేష్, అర్వ గంగయ్య, బయ్యా నరేష్, రావుల శంకర్, ఆవుదొడ్డి రామలింగయ్య, బయ్యా అంజయ్య, కడెం లింగయ్య, కడెం ఉపేందర్, చిర్ర సతీష్, చిర్ర నరేష్, దొంగలు లింగయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చిమట వెంకన్న యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండేటి సైది రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ నియోజకవర్గం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

