ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, సెప్టెంబర్ 6 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఇటీవల ఆదివాసీ మహిళపై దాడి, ఆ తరువాత చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఆసిఫాబాద్ డీఎస్పీ పంతాటి సదయ్యపై బదిలీ వేటు పడింది.
ఆయన్ను కాగజ్‌నగర్ డీఎస్పీగా బదిలీ చేయగా, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్‌ను ఆసిఫాబాద్ డీఎస్పీగా బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.