హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): దళితబంధు ఒక విప్లవమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతోనే దళితుల బతుకుల్లో వెలుగులు సాధ్యమని పేర్కొన్నారు. రెండో విడతలో1.30 లక్షల మందికి దళితబంధు పథకం వర్తింపజేయడంపై హర్షిస్తూ ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పైలట్ ప్రాజెక్టులా ప్రారంభించిన దళితబంధును రాష్ట్రమంతటా విస్తరింపజేయడం కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షతతో దళితులకు ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి విముక్తి లభిస్తున్నదని తెలిపారు. దళితబంధు పథకం అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని, అందుకే బీఆర్ఎస్ దేశమంతా విస్తరిస్తున్నది పేర్కొన్నారు. కేసీఆర్ సారథ్యంలో త్వరలోనే దేశంలో ప్రతి దళితుడికి దళితబంధు అందడం ఖాయమని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.