ధర్మసాగర్ : గ్రామాభివృద్ధిలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు(Sanitation work) మొదటి ప్రాధాన్యం కల్పిస్తూ గ్రామ సర్పంచ్, పాలకవర్గం సభ్యులు నడుం బిగించారు. ఊరంత చీపురు పట్టి వీధులు, రోడ్లు శుభ్రం చేసి పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో(Mupparam village) బుధవారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు ఊరంత ఊడ్చి, డ్రైనేజీలను శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మండల అధికారులు సైతం భాగస్వాములై కదిలారు. కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలు, సరికొత్త సంస్కరణలతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ రేణుక స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ ఎంపీడీవో అనిల్ కుమార్, తహసీల్దార్ సదానందం, ఎంపీవో అఫ్జల్ పాషా, ఉపసర్పంచ్ కుమారస్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.