జనగామ : రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో (Panchayathi Elections) పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జనగామ జిల్లా జనగామ మండలం వెంకిర్యాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వెంకిర్యాలలో బీజేపీ బలపరిచిన గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్‌గా విజయం సాధించగా, ఆమె తండ్రి గొల్లపల్లి పర్శయ్య ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఉప సర్పంచ్ ఎన్నికల్లో వార్డు సభ్యులు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు సమానంగా మద్దతు పలకడంతో సర్పంచ్ అలేఖ్య తన ఓటును బీఆర్ఎస్ మద్దతుదారుడైన తన తండ్రి గొల్లపల్లి పర్శయ్యకు వేయడంతో బీఆర్ఎస్ ఉప సర్పంచ్‌గా తండ్రి, సర్పంచ్‌గా కుమారై గెలుపొదడం విశేషం.