CM KCR | స్వరాష్ట్ర ఆకాంక్షలు ఫలించి సంక్షేమ తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది! సబ్బండ వర్గాలకూ జీవన భద్రత కల్పించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం పేదల జీవితాలకు ‘ఆసరా’ అయింది. తొమ్మిదేండ్ల పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేసి సకల జనుల భవితవ్యానికి భరోసానిస్తున్నది కేసీఆర్ సర్కార్.
ప్రజాక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఆ లక్ష్యాన్ని చేరడం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణను సంక్షేమ స్వర్ణయుగంలోకి నడిపించింది బీఆర్ఎస్ సర్కారు. పదేండ్ల పాలనలో సుమారు రూ. 5 లక్షల కోట్ల నిధులతో ప్రజా సంక్షేమ పథకాలను బాధ్యతగా అమలు చేసింది. ఏటా రూ. 50 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించి దేశ సంక్షేమ రంగ చరిత్రలో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపింది. నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పింఛన్లు భరోసా నిచ్చాయి. గీత, చేనేత, బీడీ కార్మికులకు భృతి చెల్లిస్తూ ఆయా వృత్తుల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడింది.
దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. దళితులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు మొదలుపెట్టిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1,60,914 మందికి సుమారు రూ.16,914 కోట్లను సబ్సిడీ రూపంలో సహాయం చేసి, ప్రోత్సహించింది.
వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతి కులానికీ ప్రత్యక్ష ప్రయోజనాలను చేకూర్చేలా ప్రవేశపెట్టిన పథకాలతో బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. కుల వృత్తులను బలోపేతం చేసేందుకు అమలు చేస్తున్న పథకాలతో నేడు పల్లెలు స్వయం సమృద్ధి సాధిస్తున్నాయి. జూలై 2022 నాటికి రాష్ట్రంలో 3.94 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసింది.
లంబాడీలు ‘మా తండాలో మా రాజ్యం’ కావాలని ఎన్నో ఏండ్ల నుంచి కలలు కంటున్నారు. వారి కలలను కేసీఆర్ ప్రభుత్వం సాకారం చేసింది. 500 జనాభాకు మించిన 2,471 లంబాడీ తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. స్థానిక పాలనలో సర్పంచులు, వార్డు మెంబర్లుగా అధికారంలో భాగస్వాములయ్యేలా చేసింది.
మైనారిటీ బాలుర కోసం 107, బాలికల కోసం 97 ప్రత్యేక రెసిడెన్షియల్ సూళ్లను నెలకొల్పింది. ఇమామ్లు, మౌజన్లకు నెలకు రూ.5 వేల చొప్పున మొత్తం 10 వేల మందికి జీవన భృతిని అందజేస్తున్నది. అగ్రవర్ణాల పేదలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. నిరుపేద బ్రాహ్మణులను ధూపదీప నైవేద్య పథకం ద్వారా ఆదుకుంటున్నది.
…? భరద్వాజ