హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఉదయం హైదరాబాద్ చేరుకోనున్న ఆమె విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు. హెచ్సీయూ భూముల విషయంలో వివాదంపైనే విద్యార్థులతో చర్చించనున్నట్టు తెలుస్తున్నది. సాయంత్రం గాంధీభవన్లో రాజకీయ వ్యూహబృందంతో సమావేశం నిర్వహిస్తారని సమాచారం. విద్యార్థులు, పార్టీ నేతలతో జరిపిన చర్చల తర్వాత హెచ్సీయూ భూముల వ్యవహారంపై అధిష్ఠానానికి నివేదిక సమర్పిస్తారని తెలుస్తున్నది.